T20 World Cup 2024 : బంగ్లాపై సునాయాస విజయం ఇదే ఒరవడని కొనసాగించండి డ్యూడ్

వరల్డ్ కప్ టీ 20 ప్రారంభం కానున్న నేపథ్యంలో వార్మప్ మ్యాచ్ లో భారత్ బంగ్లాదేశ్ పై విజయం సాధించింది.

Update: 2024-06-02 02:55 GMT

వరల్డ్ కప్ టీ 20 ప్రారంభం కానున్న నేపథ్యంలో వార్మప్ మ్యాచ్ లో భారత్ శుభారంభం చేసింది. బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించింది. నేటి నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను భారత్ సునాయాసంగా ఓడించగలిగింది. అరవై పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన భారత్ ఇరవై ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ అర్ధ సెంచరీ చేశాడు.

పంత్ నిలకడగా...
కెప్టన్ రోహిత్ శర్మ 23, సంజూ శాంసన్ ఒక పరుగు చేసి అవుటయ్యాడు. తర్వాత రిషబ్ పంత్ వచ్చి 53 పరుగులు చేశఆడు. సూర్యకుమార్ యాదవ్ 31 పరుగుుల చేశాడు. ఇక హార్ధిక్ పాండ్యా చివర్లో వచ్చి నలభై పరుగులు జోడించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. శివమ్ దూబె పథ్నాలుగు పరుగులు చేశాడు. దీంతో ఇరవై ఓవర్లలో 183 పరుగులు చేసింది. లక్ష్య సాధనలో తర్వాత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ బ్యాటర్లు వరసగా పెవిలియన్ బాట పట్టారు. టాప్ ఆర్డర్ మొత్తం మనోళ్ల చేతిలో బలయిపోయింది.
టాప్ ఆర్డర్ ను...
బంగ్లాదేశ్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 122 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లాదేశ్ లో మహ్మదుల్లా ఒక్కడే నలభై పరుగులు అత్యధికంగా చేశఆడు. ఓపెనర్ గా దిగిన తాంజిద్ హసన్ పదిహేడు, సౌమ్య సర్కార్ డకౌట్ తో వెనుదిరిగారు. నజ్ముల్ హుస్సేన్ కూడా డకౌట్ అయ్యాడు. 41 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ను షకీబ్ అల్ హసన్ 28 పరుగులు, మహ్మదుల్లా నిలకడగా ఆడి ఆ మాత్రం స్కోరును సాధించాడు. అయితే భారత్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ రెండు, శివమ్ దూబో రెడు, మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యా బుమ్రా, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీసి భారత్ కు విజయాన్ని అందించారు.


Tags:    

Similar News