అలవోకగా గెలిచారు..ఆటతో మురిపించారు
ఆప్ఘనిస్తాన్ పై భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అలవోకగా విక్టరీని సొంతం చేసుకుంది
ఆప్ఘనిస్తాన్ పై భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆప్ఘనిస్తాన్ విధించిన టార్గెట్ ను పూర్తి చేసింది. రోహిత్ శర్మ సెంచరీ, విరాట్ కొహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగి ఆడారు. ఫలితంగా ఆప్ఘనిస్తాన్ బౌలర్లు చేతులెత్తేశారు. తొలుత టాస్ గెలిచిన ఆప్ఘనిస్తాన్ 272 పరుగులు చేసింది. 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన వికెట్ కోల్పోకుండానే తొలి వికెట్ భాగస్వామ్యానికి భారీగా పరుగులు జోగించింది.
సెంచరీతో చెలరేగి...
మ్చాచ్ ఇరవై ఓవర్లు పూర్తయిన వెంటనే భారత్ దే విజయం అని ప్రతి ఒక్కరూ అంచనా వేశారు. రోహిత్ శర్మ ప్రతి ఆప్ఘనిస్తాన్ బౌలర్ ను ఒక ఆటాడుకున్నారు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోవడంతో భారత్ తొలి పది ఓవర్లకే భారీ స్కోరు సాధించింది. రోహిత శర్మ 131 పరుగులు, ఇషాన్ కిషన్ 47, విరాట్ కొహ్లి 55, శ్రేయస్ అయ్యర్ 25 పరుగులు చేశారు. ఏ దశలోనూ ఆప్ఘనిస్తాన్ ది పై చేయి కాలేదు. వికెట్లు కేవలం రెండు మాత్రమే కోల్పోయి భారత్ ఆప్ఘనిస్తాన్‌పై విజయం సాధించింది.