World Cup 2023 : నెదర్లాండ్స్‌పై భారత్ భారీ విజయం.. వరల్డ్ కప్ లో అరుదైన రికార్డు

ఇండియా - నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది

Update: 2023-11-12 16:01 GMT

ఇండియా - నెదర్లాండ్స్ మధ్య  మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 160 పరుగుల తేడాతో నెగ్గింది. నెదర్లాండ్స్ బ్యాటర్లు కొద్దిసేపు పోరాడినా చివరకు భారత్ దే విజయం అయింది. తొలుత టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నారు. యాభై ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ 410 పరుగులు చేసింది. 411 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ను మన బౌలర్లు కట్టడి చేయగలిగారు. ఎప్పటి లాగానే మ్యాచ్ భారత్ తన పరం చేసుకుంది.

తొలుత బ్యాటర్లు...
భారత్ బ్యాటర్లు అదిరిపోయే పెర్‌ఫర్మెన్స్ ఇచ్చారు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కొహ్లీలు అర్థ సెంచరీ చేసి అవుట్ కాగా, బరిలోకి దిగిన శ్రేయస్, కేఎల్ రాహుల్ లు సెంచరీలు చేసి భారత్‌కు ఈ వరల్డ్ కప్ లోనే అత్యధిక పరుగులు తెచ్చి పెట్టారు. ఈ వరల్డ్ కప్ లో భారత్ 410 పరుగులు చేయడం ఈ మ్యాచ్ లోనే. అందరూ అర్థ సెంచరీలు, ఇద్దరు సెంచరీలు చేయడం కూడా ఈ మ్యాచ్ లోనే. దీంతోనే భారత్ అత్యధిక స్కోరును నెదర్లాండ్స్ ముందు ఉంచగలిగింది.
బౌలర్లు కూడా..
ఇక విరాట్ కోహ్లి ఈ మ్యాచ్ లో బౌలింగ్ చేసి ఒక వికెట్ పడగొట్టి బ్యాటర్ గానే కాదు బౌలర్ గానూ తాను సత్తా ఉన్నోణ్నని నిరూపించుకున్నాడు. కులదీప్ యాదవ్, జడేజా, సిరాజ్, బుమ్రా తలో రెండు వికెట్లు, కోహ్లి, రోహిత్ శర్మ తలో ఒక వికెట్ తీశారు. దీంతో నెదర్లాండ్స్ స్కోరు పెద్దగా రాలేదు. 410 స్కోరు అంటే ఆషామాషీ కాదు. అందుకే ముందుగానే భారత్ విజయం ఖాయమయిపోయంది. వరసగా భారత్ వరల్డ్ కప్ మ్యాచ్ లలో తొమ్మిందిటికి తొమ్మిది గెలిచి తన సత్తా చాటింది. ఇక సెమీ ఫైనల్స్ లో ఎలా ఆడుతుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News