World Cup 2023 : ఎందుకు దూరం పెట్టారో.. ఆల్ రౌండర్ అనిపించ లేదా?

ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ వరల్డ్ కప్ కు దూరం అయినందుకు ఇండియన్ ఫ్యాన్స్ ఇప్పుడు చింతిస్తున్నారు

Update: 2023-10-26 04:29 GMT

వరల్డ్ కప్ లో భారత్ కు వరస విజయాలు అందుతున్నాయి. అంత వరకూ బాగానే ఉంది. హార్ధిక్ పాండ్యా ప్లేస్‌ను భర్తీ చేసెదెవరు? క్రికెట్ చూసేవారెవరికైనా వెంటనే ఠక్కున గుర్తొచ్చే పేరు అక్షర పటేల్. ఆల్ రౌండర్‌గా భారత్ ను అనేకసార్లు విజయ తీరాలకు చేర్చిన ఘనత అక్షర్ పటేల్ ది. అక్షర్ పటేల్ చివరలో వచ్చి మ్యాచ్ ను గెలిపించిన తీరును ఇప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ మరిచిపోరు. కానీ హార్ధిక్ పాండ్యా గాయపడిన తర్వాత ఆ స్థానంలో అక్షర్ పటేల్ ను తీసుకుంనే ఛాన్స్ టీం ఇండియా చేజేతులా చేజార్చుకుంది. కానీ మొన్న జరిగిన న్యూజిలాండ్ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ కు చోటు కల్పించారు. స్కై గతంలో బాగా ఆడేవాడే కాని ఫామ్ కోల్పోయి ఉన్నాడని తెలియదా? అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

ఆల్ రౌండర్ గా...
అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండర్ గా బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తాడు. బౌలర్ గా కూడా ప్రత్యర్థులను ఇబ్బంది పెడతాడు. అవసరమైన సమయంలో వికెట్లను చేజిక్కించుకుని టీం ఇండియాకు రిలీఫ్ ఇవ్వగలిగే ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. అయితే ప్రపంచ కప్‌కు ముందు గాయపడటంతో అక్షర పటేల్ ను వరల్డ్ కప్ లోకి తీసుకోలేదు. అయితే గాయం నుంచి కోలుకున్న అక్షర్ దేశవాళీ క్రికెట్ లో దుమ్మురేపుతున్నాడు. పంజాబ్ - గుజరాత్ కు జరిగిన మ్యాచ్ లో మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలి టోర్నీలో అక్షర్ ఆడిన తీరు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది.
గాయం కావడంతో...
ఆసియా కప్ జరుగుతుండగా అక్షర పటేల్ కు గాయం కావడంతో సెలక్టర్లు రవిచంద్రన్ అశ్విన్ కు చోటు కల్పించారు. అశ్విన్ కూడా ఆల్ రౌండర్ అయినప్పటికీ అక్షర్ తరహా మాత్రం కాదన్నది అందరి అభిప్రాయం. దేశవాళీ క్రికెట్ లో తమ జట్టును గెలిపించాలని చేసిన ప్రయత్నం విఫలమయినప్పటికీ చివరకు ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. గాయపడిన వారు త్వరగా కోలుకుని రావడం కష్టమని భావించి అక్షర పటేల్ ను వరల్డ్ కప్ కు ఎంపిక చేయలేదు. ఇప్పుడు హర్థిక్ పాండ్యా గాయపడటంతో అక్షర్ ను ఎందుకు సెలెక్ట్ చేయలేదా? అని తలలు పట్టుకుంటున్నారు. అయినా ప్రయోజనం లేదు. బీసీసీఐ కావాలనే తప్పించిందా? లేక గాయం కారణంగా నిజంగా దూరమయ్యాడా? అన్న చర్చ క్రికెట్ ఫ్యాన్స్‌లో జరుగుతుంది.


Tags:    

Similar News