World Cup 2023 : వరసబెట్టారు... ఇంగ్లండ్ కు సులువు చేశారా?

భారత్ - ఇంగ్లండ్ మ్యాచ్ లో భారత్ టాప్ ఆర్డర్ తడబడింది. వరసగా అవుట్ కావడంతో తక్కువ స్కోరుకే పరిమితం కానుంది

Update: 2023-10-29 11:24 GMT

భారత్ - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో భారత్ టాప్ ఆర్డర్ తడబడింది. వరసగా అవుట్ కావడంతో అతి తక్కువ స్కోరు చేసే పరిస్థితి నెలకొంది. ఓపెనర్ గా దిగిన శుభమన్ గిల్ ఆ తర్వాత వచ్చిన విరాట్ కొహ్లి, వెను వెంటనే క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ వరసగా వెనుదిరిగారు. కేఎల్ రాహుల్ వచ్చిన తర్వాత కొంత స్కోరు పెరిగింది. అయితే ఇంగ్లండ్ ను శాసించే స్థాయిలో మాత్రం భారత్ పరుగులు చేయలేకపోతుంది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఇండియన్ బ్యాటర్లు వరస పెట్టి పెవిలియన్ బాట పడుతున్నారు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది

తక్కువ పరుగులు....
దీంతో 37 ఓవర్లకు భారత్ కేవలం 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇది ఎంత మాత్రం సరిపోయే స్కోరు కాదన్నది అందరికీ తెలిసిందే. ఇంగ్లండ్ సీమర్లకు ఇండియా బ్యాటర్లు తలవొంచారు. వరసగా ఐదు మ్యాచ్ లు గెలిచిన భారత్ కు ఇంగ్లండ్ బౌలర్లు చెక్ పెట్టినట్లే కనిపిస్తుంది. ఒక్క రోహిత్ శర్మ మాత్రం మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. 87 పరుగులు చేసిన రోహిత్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జడేజా, సూర్యకుమార్ యాదవ్ లు ఉన్నారు. ఇంగ్లండ్ కు ఛేదనలో ఎక్కువ పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించే పరిస్థితిలో భారత్ లేదనే చెప్పాలి. రోహిత్ పుణ్యమా అని ఆ మాత్రమైనా పరుగులు చేయగలిగింది.


Tags:    

Similar News