Wolrd Cup Finals 2023 : వరల్డ్ కప్ ఫైనల్స్ కు ఖలీస్థానీ బెదిరింపు

రేపు వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుండగా ‌‌ఖలీస్థానీ ఉగ్రవాది బెదిరింపులకు దిగాడు;

Update: 2023-11-18 12:09 GMT
gurupatwant singh pannu, khalistani terrorist,  threat, world cup
  • whatsapp icon

రేపు వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుండగా ‌‌ఖలీస్థానీ ఉగ్రవాది బెదిరింపులకు దిగాడు. ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్స్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఈ బెదిరింపులతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాని మోదీతో పాటు ఆస్ట్రేలియా ఉప ప్రధాని కూడా ఈ మ్యాచ్ కు హాజరు కానుండటంతో పోలీసులు అణువణువూ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే స్టేడియం పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు.

భారీ భద్రత...
వరల్డ్ కప్ మ్యాచ్ ను నిలిపేయాలంటూ ఆయన వీడియో విడుదల చేశాడు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 గుజరాత్ అల్లర్ల గురించి చెబుతూ మతపరంగా ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానాలు చేయడంతో పోలీసులు పన్నూ హెచ్చరికలపై అలెర్ట్ అయ్యాడు. ఇజ్రాయిల్ - హమాస్ మధ్య యుద్ధంనుంచి మోదీ గుణపాఠం నేర్చుకోవాలని కోరారు. ఇండియాలోనూ ఇలాంటి యుద్ధం ప్రారంభమవుతుందని హెచ్చరించాడు. దీంతో పోలీసులు స్టేడియంలో భారీ భద్రతను ఏర్పాటు చేయనున్నారు.


Tags:    

Similar News