ఇండియా టార్గెట్ 257
భారత్ - బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ వరల్డ్ కప్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. బంగ్లాదేశ్ భారత్ ముందు భారీ లక్ష్యాన్నే ఉంచారు.
భారత్ - ఇండియా మధ్య మ్యాచ్ వరల్డ్ కప్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. బంగ్లాదేశ్ బ్యాటర్లు భారత్ ముందు భారీ లక్ష్యాన్నే ఉంచారు. భారత్ 257 పరుగులు చేయాల్సి ఉంది. జడేజా, బూమ్రా, సిరా్ తలో రెండు వికెట్లు తీయగా, కులదీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ మరో వికెట్ తీశారు. దీంతో యాభై ఓవర్లలో భారత్ బౌలర్లు బంగ్లాదేశ్ కు చెందిన ఎనిమిది వికెట్లను మాత్రమే తీయగలిగారు. యాభై ఓవర్లకు 256పరుగులు చేసిన బంగ్లాదేశ్ భారత్ ముందు ఛాలెంజ్ విసిరిందనే చెప్పాలి.
భారీ లక్ష్యమే...
257 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. భారత్ బ్యాటర్లు నిలదొక్కుకుంటేనే ఈ స్కోరును చేయగలరు. ఓపెనర్లు నిలకడగా ఆడితే ఈ స్కోరు పెద్దది కాకపోయినప్పటికీ బంగ్లాదేశ్ ఎదుట పిల్లి మొగ్గలు వేయకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. లిటన్ దాస్ 66, మహ్మదుల్లా 46 పరుగులు అత్యధికంగా చేయశారు. 93 పరుగుల వరకూ ఒక వికెట్ కూడా పడకపోవడంతో ఈ మాత్రం స్కోరు బంగ్లాదేశ్ కు లభించింది. మరి భారత్ బ్యాటర్లు ఎలా ఆడతారన్నది చూడాల్సి ఉంది.