T20 World Cup : స్టేడియంలో భారీ వర్షం... అదే జరిగితే?
మరికాసేపట్లో భారత్ - ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా సెమీ ఫైనల్స్ నేడు జరగనుంది.
మరికాసేపట్లో భారత్ - ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా సెమీ ఫైనల్స్ నేడు జరగనుంది. గయానా స్టేడియంలో రాత్రి ఎనిమిది గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే గయానా స్టేడియంలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో మ్యాచ్ జరగడంపై నీలినీడలు అలుముకున్నాయి. భారీ వర్షం కురిస్తే పది ఓవర్లయినా ఇరు జట్లు ఆడాల్సి ఉంటుంది. లేకుంటే మాత్రం మ్యాచ్ ను రద్దు చేస్తారు. అదే జరిగితే భారత్ ఆడకుండానే ఫైనల్స్ కు చేరుకుంటుంది.
నేరుగా ఫైనల్స్ కు...
మ్యాచ్ కు రిజర్వ్‌డే మాత్రం లేదు. 29న ఫైనల్స్ కు ప్రకటించారు. దీంతో ఒకవేళ నేడు మ్యాచ్ వర్షం కారణంగా కొంత ఆలస్యమయితే వెయిట్ చేస్తారు. ఓవర్లను కుదించి గేమ్ ను కొనసాగిస్తారు. అప్పటికీ సాధ్యంకాకపోతే మాత్రం మ్యాచ్ రద్దవుతుంది. మ్యాచ్ రద్దయితే మాత్రం భారత్ నేరుగా ఫైనల్స్ కు చేరకుంటుంది. సూపర్ 8లో భారత్ సాధించిన పాయింట్ల ఆధారంగా ఫైనల్స్ కు చేరుకుంటుంది. ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరి ఏం జరుగుతుందన్నదిచూడాలి.