World Cup 2023 : టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్

మరికాసేపట్లో భారత్ - ఇంగ్లండ్ మధ్య లక్నోలో మ్యాచ్ ప్రారంభం కానుంది.

Update: 2023-10-29 08:05 GMT

మరికాసేపట్లో భారత్ - ఇంగ్లండ్ మధ్య లక్నోలో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుండటంతో ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంగ్లండ్ ను కట్టడి చేయాల్సి ఉంటుంది. భారత్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ ఉత్కంఠను నెలకొనింది. చాలా రోజుల నుంచి భారత్ కు ఇంగ్లండ్ మీద విజయం లభించలేదు. దీంతో దూకుడు మీదున్న భారత్ ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్ దే పై చేయి అయినా...
ఇప్పటి వరకూ భారత్ - ఇంగ్లండ్‌ల మధ్య 106 వన్డే మ్యాచ్ లు జరగ్గా భారత్ 57 మ్యాచ్ లు గెలిచింది. ఇంగ్లండ్ 44 సార్లు మాత్రమే విజేతగా నిలిచింది. రెండు మ్యాచ్ లు టైగా ముగిశాయి. సొంతగడ్డమీద ఆడుతుండటం భారత్ కు అందివచ్చిన అవకాశంగా చెప్పాలి. ఇప్పుడు భారత్ గెలిస్తే సెమీస్ కు దూసుకెళ్లినట్లే. ఇంగ్లండ్ ఎదుట ఎక్కవ లక్షాన్ని నిర్దేశిస్తే భారత్ దే పై చేయి అవుతుంది. 


Tags:    

Similar News