World Cup Semi Finals 2023 : టాస్ గెలిచి బ్యాటింగ్.. ఇక దబిడి దిబిడే
భారత్ - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో జరగనుంది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్ - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో జరగనుంది. టాస్ గెలిచిన ఇండిమా బ్యాటింగ్ ఎంచుకుంది. వరస విజయాలతో దూకుడు మీదున్న భారత్ ముంబయిలో జరగనున్న వాంఖడే స్టేడియంలోనూ గెలుపు తమదేనన్న ధీమాలో ఉంది. జట్టు కూడా ఫుల్లు ఫామ్ లో ఉండటం కలసి వచ్చే అంశంగా చూడాలి. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా కూడా భారత్ పటిష్టమైన స్థితిలో ఉండటంతో ఈసారి వరల్డ్ కప్ భారత్ దేనన్న అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో నేటి మ్యాచ్ జరగనుంది.
ఆటకు తోడు...
అయితే ఆటకు తోడు అదృష్టం కూడా కలసి రావాలని స్వయానా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించడం కూడా ఆలోచించాలి. న్యూజిలాండ్ ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ జట్టులో ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లను కట్టడి చేయగలిగితే సునాయాస విజయం లభించవచ్చు. ప్రధానంగా కాన్వే, రచిన్ రవీంద్రలను కనుక వెంటవెంటనే అవుట్ చేయగలిగితే మనదే విజయం అవుతుంది. ఇప్పటికే వాంఖడే స్టేడియం అభిమానులతో నిండిపోయింది. ఇక గెలుపు కోసం అందరం నిరీక్షించాల్సిందే.