అనుమానం ఉన్నా...
టాస్ గెలిచిన భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకుంది. భారత్ భారీ స్కోరును దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఈ మ్యాచ్ లో గెలవాలంటే 327 పరుగులు చేయాల్సి ఉంది. 327 పరుగులు సౌతాఫ్రికా చేయాల్సిఉన్నా ఎక్కడో డౌట్. ఏ మూలనో సందేహానుమానం. ప్రతి ఒక్కరిలోనూ అంతే. గెలుస్తామా? లేదా? సౌతాఫ్రికా ఈ టార్గెట్ చేస్తుందా? చేయగలదా? లేదు.. లేదు.. అని మనలో మనం సర్ది చెప్పుకుని సంతోషపడ్డామే తప్ప ప్రతి ఒక్కరినీ అనుమాన భూతం వెంటాడుతూనే ఉంది. అయితే బౌలింగ్ లో మనోళ్లు మరోసారి తమకు తిరుగులేదనిపించుకున్నారు. పేసర్లు, స్పిన్నర్లు తమ చేయి తిప్పుతూ సౌతాఫ్రికాను చిత్తు చిత్తుగా ఓడించారు. వరల్డ్ కప్ లో వరసగా ఎనిమిదో విజయాన్ని సొంతం చేసుకుని టేబుల్ టాపర్ గా నిలిచింది. పట్టికలో పదహారు పాయింట్లకు భారత్ చేరింది.
టాస్ గెలిచి...
టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ నలభై పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అనంతరం మైదానంలో దిగిన విరాట్ కోహ్లి 101 పరుగులు చేశాడు. వన్డేల్లో తన 49వ సెంచరీని నమోదు చేశాడు. విరాట్ కోహ్లి అనుకున్నట్లుగానే ఈ మ్చాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. శుభమన్ గిల్ పెద్దగా పరుగులు చేయకుండా అవుట్ కావడంతో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ 70 పరుగులకు పైగానే చేశాడు. కానీ ఏం చేస్తాం. అయ్యర్ కు సెంచరీ అచ్చిరావడం లేదు. ఇప్పుడు కూడా తృటిలో మిస్ అయ్యాడు. తర్వాత వచ్చిన కేెఎల్ రాహుల్ కూడా ఎనిమిది పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ దిగి 22 పరుగులు, జడేజా 29 పరుగుల స్కోరు బోర్డుకు జోడించాడు. దీంతో 326 పరుగులు యాభై ఓవర్లలో టీం ఇండియా చేయగలిగింది.
వరస వికెట్లు తీస్తూ...
తర్వాత ఛేదనలో సౌతాఫ్రికా కొంత సౌతాఫ్రికా ఆటగాళ్లు అస్సలు గ్రౌండ్ లో నిలదొక్కుకోలేకపోయారు. ఐదు పరుగులకే సిరాజ్ ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్ డీకాక్ ను అవుట్ చేయడంతో ప్రారంభమయిన పతనం చివర వరకూ కొనసాగుతూనే ఉంది. ఎవరూ పెద్దగా పరుగులు చేయకుండానే అవుట్ అవుతూ వచ్చారు. కేవలం నలభై పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సిరాజ్ ఒకటి, షమి రెండు, జడేజా ఐదు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా వెన్ను విరిచేశారు. కులదీప్ యాదవ్ మిగిలిన రెండు వికెట్లు తీసి ముగించేశాడు. మిగిలిన ఆట చప్ప చప్పగా సాగింది. వన్ సైడ్ గా సాగిన ఈ ఆట మనకు మంచి కిక్కును ఇచ్చిందనే చెప్పాలి. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు.. ఇంత పరాభవాన్ని ఎప్పుడూ చవి చూసి ఉండరు. పూర్ ఫెలోస్.. అంతే కాలం కలసి రాలేదనుకుని సఫారీలు తమకు తాము సర్ది చెప్పుకుని మిగిలిన మ్యాచ్‌లపై దృష్టి పెట్టాలి.