కట్టడి చేశారు.. స్వల్ప స్కోరుకే...?
భారత్ - ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతుంది. తక్కువ పరుగులకే భారత్ బౌలర్లు ఆస్ట్రేలియాను కట్టడి చేశారు
భారత్ - ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతుంది. తక్కువ పరుగులకే భారత్ బౌలర్లు ఆస్ట్రేలియాను కట్టడి చేయగలిగారు. ఇప్పటికే ఎనిమిది వికెట్లు పడ్డాయి. ఆస్ట్రేలియా బ్యాటర్లు ఒకరకంగా విఫమయినట్లే. కులదీప్ యాదవ్, బూమ్రా వికెట్లు తీసుకున్నారు. 181 పరుగులే చేశారు. మరో రెండు ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. పెద్దగా రాణించే అవకాశాలు లేవు. దీంతో ఆస్ట్రేలియా పెద్దగా పరుగులు చేయకుండానే వరల్డ్ కప్ లో భారత్ లో మ్యాచ్‌లో చేతులెత్తేసింది.
పెద్ద టార్గెట్ కాకపోవడంతో...
పెద్దగా టార్గెట్ లేకపోవడం, సొంత మైదానం కావడంతో భారత్ కు వరల్డ్ కప్ లో తొలి వన్డేలో గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం బౌలర్లు స్టార్క్, జంపా ఆడుతున్నారు. రన్ రేట్ నాలుగు కూడా దాట లేదు. శుభమన్ గిల్ లేకపోయినా రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, జడేజా వంటి వారు ఉండటంతో తక్కువ స్కోరు ఛేజించడం సాధ్యం కాకపోవచ్చు. అదే జరిగితే వరల్డ్ కప్ లో తొలి వన్డేలో భారత్ శుభారంభం చేసినట్లే.