World cup : ఆ ఒక్కడూ ఉంటే చాలా.. ఇలా అందరూ ఉన్నారంటే?
రవీంద్ర జడేజా.. ఒక ఫైర్. ఫామ్ లో ఎప్పుడూ కొనసాగుతాడు. జడేజా ఉంటే అవతలి వాడికి జడుపేనన్నది వాస్తవమే
రవీంద్ర జడేజా.. ఒక ఫైర్. ఫామ్ లో ఎప్పుడూ కొనసాగుతాడు. జడేజా ఉంటే అవతలి వాడికి జడుపేనన్నది వాస్తవమే. ఇటు బౌలింగ్ పరంగా, అటు బ్యాటింగ్ పరంగా జడేజా ఆల్ రౌండర్‌గా అశేష అభిమానులను చూరగొన్నాడు. విరాట్ కొహ్లి తర్వాత జడేజాకు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. జడేజా పెర్‌ఫార్మెన్స్ ప్రతి గేమ్ లోనూ ప్రత్యేకంగానే కనిపిస్తుంది. బ్యాటింగ్ ఆర్డర్ లో దాదాపు చివరిలో వచ్చినా టీం ను గెలిపిస్తాడన్న పిచ్చి నమ్మకం జడేజా ఎప్పుడూ వమ్ము చేయలేదు.
వికెట్లు తీయడంలో...
జడేజా స్పిన్ మాయాజాలానికి వికెట్లు టపా టపా రాలిపోతుంటయి. పేసర్లకు ప్లేయర్లను కష్టమయిన సమయంలో జడేజా ఎంట్రీ ఇచ్చి పెవిలియన్ కు పట్టించడం మామూలు విషయంగా మారిపోయింది. జడేజా లేని భారత్ జట్టును ఊహించుకోలేక పోతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అందుకే జడేజాపై పెద్ద భారమే పెడతారు సెలక్టర్లు. ఇక ఫీల్డింగ్ లోనూ ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించడు. జడేజా వైపునకు బంతి వెళ్లింది అంటే అక్కడ ఆగిపోవాల్సిందే. పైకి లేచి వచ్చిందంటే క్యాచ్ అంతే. చాలా అద్భుతమైన క్యాచ్‌లు జడేజా ప్రేక్షకులకు లైవ్‌లో చూపించాడు.
బ్యాటర్ గా... ఫీల్డర్ గా...
మొన్నటికి మొన్న న్యూజిలాండ్ పై ఒక క్యాచ్ జారవిడచడం మాత్రం కొంత బాధించినా ఇప్పటి వరకూ అలాంటి తప్పు జరగేలేదన్నది వాస్తవం. అన్ని ఫార్మాట్లలో తన సత్తా చూపుతున్న జడేజా వరల్డ్ కప్ లోనూ తనదైన శైలిలో ఆడుతున్నాడు. అందుకే జడేజా ఉంటే అదొక ధైర్యమని ఫ్యాన్స్ భావిస్తారు. మొన్నటి న్యూజిలాండ్ మ్యాచ్ లోనూ జడేజా ఒక సిక్సర్ బాదడంతో రన్ రేటు తగ్గింది. అంతేకాదు చివరి బంతికి బౌండరీ లైన్ వైపు మరల్చి భారత్ కు విజయాన్నిఅందించారు. బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్ లోనూ సత్తాచూపుతున్న జడేజా మరింత రాణించాలని, మరిన్ని అవార్డులు, రివార్డులు అందుకోవాలని ఆశిద్దాం. అందుకే జడేజాకు స్టేడియంలో ఈ జేజేలు వినిపించాయి.