T20 World Cup 2024 : సెమీ ఫైనల్స్ లో ఆ ఇద్దరికీ చోటు లేదా? కొత్త వారికి అవకాశం కల్పించనున్నారా?

టీ 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ రేపు జరగనున్నాయి. రేపు భారత్ - ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది

Update: 2024-06-26 03:59 GMT

టీ 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ రేపు జరగనున్నాయి. రేపు భారత్ - ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. గయానా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై గెలిస్తే కానీ భారత్ ఫైనల్స్ కు చేరుకోదు. అందుకే భారత్ జట్టు కొన్ని మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ భారత్ వరస మ్యాచ్ లలో గెలుస్తూ వస్తుంది. ఐర్లాండ్, అమెరికా, పాకిస్థాన్ ల మీద గెలిచి సూపర్ 8కు చేరుకుంది. అదే సమయంలో సూపర్ 8లోనూ ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా మీద గెలిచి ఓటమి అంటూ లేకుండా భారత్ వరస విజయాలతో ముందుకు వెళుతుంది. అదే పంథాను కొనసాగించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

అంత ఈజీ కాదు...
అయితే సెమీ ఫైనల్స్ లో ఇంగ్లండ్ ను ఎదుర్కొనడం అంత సులువు కాదు. 2022 లో సెమీ ఫైనల్స్ లో ఇంగ్లండ్ చేతిలోనే భారత్ ఓటమి పాలయిన విషయాన్ని కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ప్రతీకారం తీర్చుకోవాలంటే జట్టులో మార్పులు చేయకతప్పదని సూచిస్తున్నారు. ఫాంలో లేని ఆటగాళ్లను పక్కనపెట్టాలన్న ఆలోచన కూడా బయలుదేరింది. ఇందుకు పెద్దగా అభ్యంతరాలు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రభావం చూపలేని ఆటగాళ్లను జట్టులో ఉంచుకుని ప్రయోగానికి సిద్ధమయ్యేకన్నా, మార్పులు చేసి ముందుకు వెళ్లడమే మంచిదని అనేక మంది క్రీడా నిపుణులు కూడా సూచిస్తున్నారు. అందుకే కొన్ని మార్పులు చేర్పులు చేయవచ్చని భావిస్తున్నారు.
విజయం సాధించాలంటే?
బౌలర్లందరూ విజయానికి బాటలు వేయడంతో వారిని కదలించకపోవచ్చు. అయితే బ్యాటర్లలో మాత్రం విరాట్ కోహ్లి, శివమ్ దూబేలపై వేటు పడే అవకాశముందంటున్నారు. విరాట్ కోహ్లీ ఈ వరల్డ్ కప్ లో పెద్దగా రాణించలేదు. మొత్తం ఆరు మ్యాచ్ లలో 66 పరుగులు మాత్రమే చేశాడు. ఎక్కువ సార్లు డకౌట్ అవ్వడం కూడా ఆందోళనకు గురి చేస్తుంది. ఓపెనర్ గా దిగి త్వరగా అవుట్ అవుతుండటంతో తర్వాత వచ్చే ఆటగాళ్లపై వత్తిడి పడుతుంది. దీంతో విరాట్ కోహ్లిని పక్కన పడతారన్న ప్రచారం జరుగుతుంది. విరాట్ స్థానంలో ఓపెనర్ గా యశస్వి జైశ్వాల్ ను తీసుకోవాలని యోచిస్తున్నారు. అలాగే శివమ్ దూబేను కూడా పక్కన పెట్టి మరొకరికి అవకాశం ఇవ్వాలన్న యోచనలో టీం మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలిసింది. మరి చివరకు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది మాత్రం వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News