World Cup Finals 2023 : పిచ్ ఎలా ఉందని కాదన్నయ్యా.. నిలబడతే కదా?
వరల్డ్ కప్ లో పది మ్యాచ్ లు వరసగా గెలిచిన టీం ఇండియా ఫైనల్స్ లో ఆస్ట్రేలియా పై హ్యండ్సప్ అనేసింది
వరల్డ్ కప్ లో పది మ్యాచ్ లు వరసగా గెలిచిన టీం ఇండియా ఫైనల్స్ లో ఆస్ట్రేలియా పై హ్యండ్సప్ అనేసింది. అందరూ పిచ్ బౌలింగ్ కు అనుకూలమని చెబుతున్నప్పటికీ కనీసం నిలబడి కనీస స్కోరు చేసి ఆస్ట్రేలియా పై వత్తిడిని ఉంచలేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ వరల్డ్ కప్ లో పది మ్యాచ్ లలోనూ అందరూ బాగానే ఆడారు. ఒక్క సూర్యకుమార్ యాదవ్ తప్ప. స్కై అంటేనే విరుచుకుపడతాడని పేరు. అలాంటిది సూర్యకుమార్ యాదవ్ ఈ వరల్డ్ కప్ లో పెద్దగా పరుగులు చేయలేదు.
ఆ భరోసా ఏదీ?
గతంలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడన్న భరోసా ఉండేది. కానీ క్రమంగా అది కోల్పోతున్నట్లు కనిపించింది. దూకుడుగా ఆడటం తగ్గించడమే కాకుండా కనీస స్కోరు ను చేయలేకపోవడం సూర్యపై ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఒకప్పుడు సూర్య వేరు.. ఈ సీజన్ లో సూర్య వేరు అందరూ ఫామ్ లో ఉన్నప్పటికీ సూర్య మాత్రం నిలదొక్కుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు. అలాంటి సూర్యను జట్టులోకి ఎందుకు తీసుకున్నారన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. మరొకరిని తీసుకున్నా కొద్దో గొప్పో ప్రయోజనం ఉండేది కదా? అన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి.
తన వెనక ఎవరూ లేరని...
అందరూ అవుట్ అవుతున్న తరుణంలో అహ్మదాబాద్ మ్యాచ్ లోనైనా సూర్య నిప్పులు చెరుగుతాడని భావించారు. సరే.. బౌలింగ్ కు అనుకూలించే పిచ్ అని అనుకున్నా.. తాను అవుట్ అయితే తర్వాత వెనక ఎవరూ లేరని సూర్యకు తెలియంది కాదు. తాను చివర వరకూ నిలబడి జట్టుకు 250 పరుగులు తెస్తాడని అంచనాలు కూడా సూర్య నిలబెట్టుకోలేకపోయాడు. బాధ్యతారాహిత్యంగా ఇన్నింగ్స్ ను వదిలేశాడన్న షాకింగ్ కామెంట్స్ నెట్టింట కనపడుతున్నాయి. సూర్యపై ఎన్నో హోప్స్ పెట్టుకుని విరాట్ కోహ్లి తర్వాత జడేజాను పంపినా.. జడేజా అవుటయిన తర్వాత వచ్చిన సూర్య 18 పరుగులు చేసి అవుట్ కావడంతో స్కై నుంచి ఇలాంటి ఆట ఎక్సెప్ట్ చేస్తామా? అన్నది ఫ్యాన్స్ అభిప్రాయం.