World Cup 2023 : టీం ఇండియాపై "కప్పు" మీద భ్రమలు తొలగిపోతున్నాయా?

ఈసారి ఇండియాపై ఫ్యాన్స్ ఎంతో హోప్స్ పెట్టుకున్నారు. వరల్డ్ కప్ మనదేనన్న ధీమాతో ఉన్నారు.

Update: 2023-10-29 13:39 GMT

ఈసారి ఇండియాపై ఫ్యాన్స్ ఎంతో హోప్స్ పెట్టుకున్నారు. వరల్డ్ కప్ మనదేనన్న ధీమాతో ఉన్నారు. వరసగా ఐదు మ్యాచ్ లు విజయం సాధించడంతో ఇక మనకు తిరుగేలేదని కాలర్ ఎగరేసి మరీ చెప్పుకున్నారు. పెద్ద పెద్ద టీంలనే మట్టికరిపించిన మనోళ్లు బలహీనంగా ఉన్న జట్లపై విజయం నల్లేరు నడకగానే భావించారు. కానీ ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్ తో అది భ్రమ అని తేలిపోయింది. అవన్నీ అపోహలేనని ఇప్పుడు రుజువైంది. ఈసారి వరల్డ్ కప్ లో అతి బలహీనంగా ఉన్న జట్టు ఏదైనా ఉందీ అంటే.. అది బంగ్లాదేశ్.. ఇంగ్లండ్ లు మాత్రమే. బంగ్లాదేశ్ మీద గెలిచారు కానీ, ఇంగ్లండ్ పై మాత్రం పెద్ద పరుగులు చేయకపోవడంతో టీం ఇండియా ముందు ముందు పెరఫార్మెన్స్ పై అనుమానాలు బయలుదేరాయి.

బలహీనంగా ఉన్న....
వరల్డ్ కప్ లో ఇప్పటి వరకూ ఇంగ్లండ్ ఒక జట్టు మీద మాత్రమే గెలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయినా అది పెద్దగా రాణించలేకపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఆ టీం అంత వీక్ మరొకటి లేదన్నది అందరికీ అర్థమయింది. అలాంటిది ఇంగ్లండ్ జట్టుపై ఆపసోపాలు పడుతుందని ఎవరూ ఊహించలేదు. సులువుగా గెలుస్తుందనుకున్నారు. న్యూజిలాండ్ పైనే గెలిచిన మనోళ్లు ఇంగ్లండ్ టీంపై పెద్ద కష్టపడకుండా గెలుస్తారని భావించారు. టాస్ గెలవడం మన చేతిలో లేదు. కానీ బ్యాట్ మన చేతిలోనే ఉందిగా. కానీ ఎవరూ రాణించలేకపోవడంతో అతి తక్కువ పరుగులకే టీం ఇండియా తన ఇన్నింగ్స్ ను ముగించింది.
బౌలర్లపైనే భారం...
ఇక బౌలర్లపైనే భారం పడింది. బౌలర్లు సక్సెస్ అయితేనే ఈ మ్యాచ్ లో టీం ఇండియా గెలవగలదు. లేకుంటే ఇక వరల్డ్ కప్ లో తొలి ఓటమిని మూటకట్టుకోవాల్సి ఉంటుంది. అదీ సెమీ ఫైనల్ కు కూడా చేరలేని ఒక చెత్త పెరఫార్మెన్స్ టీం మీద ఓటమి పాలయ్యామన్న అప్రదిష్టను మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఎవరూ కుదరుగా నిలబడలేదు. క్రీజులో అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. తాము ఇప్పటికే ఐదు మ్యాచ్ లు గెలిచామన్న ధీమా తో కావచ్చు. కొంత నిర్లక్ష్యం కూడా టీం ఇండియా తక్కువ స్కోరు చేయడానికి కారణమయింది. వారం రోజుల విశ్రాంతి తర్వాత మనోళ్లు ఇంకా ఆట మీద ధ్యాస పెట్టినట్లు కనిపించలేదన్న కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి ఈ మ్యాచ్ గెలుస్తుందా? లేదా? అన్నది పూర్తిగా బౌలర్ల పైనే ఆధారపడి ఉండటంతో భారత్ అభిమానుల్లో నిరాశ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.


Tags:    

Similar News