T20 World Cup : నేడు వరల్డ్ కప్ ఫైనల్స్

నేడు భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య టీ 20 మ్యాచ్ ఫైనల్ పోరు జరగనుంది.;

Update: 2024-06-29 02:19 GMT
T20 World Cup : నేడు వరల్డ్ కప్ ఫైనల్స్
  • whatsapp icon

నేడు భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య టీ 20 మ్యాచ్ ఫైనల్ పోరు జరగనుంది. టీ20 వరల్డ్ కప్ లో నేడు ఫైనల్స్ జరుగుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇరు జట్లు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. పోరు హోరా హోరీగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. భారత్ రెండోసారి వరల్ట్ కప్ ను గెలవాలని తహతహలాడుతుంది. 2007 లో టీ20 వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకుంది.

ఇప్పటి వరకూ...
సౌతాఫ్రికా ఇప్పటి వరకూ కప్ ను గెలుచుకోలేదు. అందుకే ఈసారి కప్పు కొట్టాలని దక్షిణాఫ్రికా కసి మీద ఉంది. టైటిల్ పోరులో గెలుపు ఎవరిదన్న అంచనాలు వేయడం కష్టమే. బ్రిడ్జిటౌన్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. బలాబలాలను చూస్తే రెండు జట్లు ఈ వరల్డ్ కప్ ఓటమి ఎరుగకుండా వరస గెలుపులతో ఫైనల్స్ లో ప్రవేశించాయి. మరి ఈరోజు ఎవరిది పై చేయి అన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News