World Cup 2023 : సెమీస్ కు వెళ్లేది వీళ్లే.. నేడు తేలిపోతుందా?

ఈరోజు వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. సెమీస్ కు ఎవరు వెళ్లేది నేడు తేలిపోనుంది.;

Update: 2023-11-04 03:09 GMT
australia, world cup, pakisthan, new zealand, cricket match, semis
  • whatsapp icon

ఈసారి వరల్డ్ కప్ లో అన్నీ సంచలనాలే. ఏ జట్టు విజయం సాధిస్తుందో చెప్పలేం. బలమైన జట్టు ఇదీ అని అంచనా వేయలేం. బలహీన జట్టు అనుకుని చూడకుండా ఉన్నామంటే మంచి ఆటను మిస్ అవుతాం. ఏది బలమైన జట్టు.. ఏది బలమైన టీం అన్నది అంచనాలకు కూడా అందకుండా ఉంది. ఇదీ ఈ వరల్డ్ కప్ ప్రత్యేకత. ఈరోజు మరో స్పెషాలిటీ కూడా ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్ లలో రెండు జట్లు గెలిస్తే సెమీస్ కు వెళ్లేందుకు మార్గం మరింత సుగమమవుతుంది. అందుకే వరల్డ్ కప్ ఈరోజు వెరీ వెరీ స్పెషల్ డే అని చెప్పాలి.

ఆసిస్ గెలిస్తే...
ఈరోజు వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఈరోజు ఇంగ్లండ్ తో తలపడనుంది. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ కు దాదాపు చేరినట్లే. ఇప్పటికే ఆరు మ్యాచ్ లు ఆడిన ఆసిస్ నాలుగింటిలో విజయం సాధించింది. ఈరోజు కూడా మ్యాచ్ గెలిస్తే పది పాయింట్లు చేరుకుని దాదాపుగా సెమీస్ కు చేరుతుంది. అయితే ఓపెనర్ మిచెల్ మార్ష్, మ్యాక్స్ వెల్ అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు మైనస్. అయితే ఇంగ్లండ్ ఈ వరల్డ్ కప్ లో బలహీనమైన ప్రదర్శన చూపతుండటంతో ఆసిస్ గెలుపు పెద్ద కష్టమేమీ కాదన్న అంచనాలు వినపడుతున్నాయి. ఇంగ్లండ్ సెమీస్ కు దూరమయిన నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.
న్యూజిలాండ్ గెలిచినా...
ఇక మరో మ్యాచ్ న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ తో తలపడుతుంది. పాకిస్థాన్ ఏడు మ్యాచ్ లు ఆడి కేవలం మూడింటిలోనే నెగ్గుతుంది. ఇప్పటికే ఆప్ఘనిస్థాన్ కంటే పాయింట్ల పట్టికలో వెనకంజలో ఉంది. ఈ మ్యాచ్ నెగ్గితే సెమీస్ కు కొంత చేరువలో ఉన్నట్లే. అదే సమయంలో న్యూజిలాండ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఇక పాక్ ఇంటి దారి పట్టినట్లే. న్యూజిలాండ్ దాదాపుగా సెమీస్ చేరుతుంది. అందుకే ఈరోజు జరిగే రెండు మ్యాచ్ లు సెమీస్ ను నిర్ణయిస్తాయి. ఈరోజు శనివారం కావడం, రెండు కీలకమైన మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ కు పండగేనని చెప్పవచ్చు.


Tags:    

Similar News