World Cup 2023 : ఇద్దరు అర్థసెంచరీలు... బౌలర్లపైనే ఇక బాధ్యత
ఇండియా - సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో విరాట్ కొహ్లి, శ్రేయస్ అయ్యర్‌లు అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నారు
వన్డే కప్ లో టీం ఇండియా బ్యాటర్లు శ్రమిస్తున్నారు. ఇండియా - సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో విరాట్ కొహ్లి, శ్రేయస్ అయ్యర్‌లు అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నారు. విరాట్ కొహ్లి 68 పరుగులతోనూ, శ్రేయస్ అయ్యర్ 77 పరుగులతోనూ ఆడుతున్నారు. రోహిత్ శర్మ 40 పరుగులకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత శుభమన్ గిల్ కూడా అవుట్ కావడంతో శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చి కుదుట పడటంతో భారత్ రెండు వందల పరుగులు దాటింది. ఇంకా పదహారు ఓవర్లు మిగిలి ఉన్నాయి.
మూడు వందలు దాటే....
ప్రస్తుతమున్న రన్ రేట్ ప్రకారం చూస్తే భారత్ 300 పరుగులు దాటే అవకాశముంది. సౌతాఫ్రికా ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు వికెట్ల తర్వాత భారత్ బ్యాటర్లను పెవిలియన్ దారి పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సౌతాఫ్రికాను కట్టడి చేయడానికి భారత్ బౌలర్లు కూడా శ్రమించాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఫామ్ లో ఉన్నందున భారత్ బౌలర్ పై పెద్ద బాద్యతే ఉంది. చూడాలి ఛేదనలో సౌతాఫ్రికా ఏం చేస్తుందనేది.