World Cup Semi Finals 2023 : బీపీ పెరుగుతోంది బాసూ... త్వరగా ఫినిష్ చేసేయండి

ఇండియాలో వరల్డ్ కప్ ఫీవర్ కొనసాగుతుంది. ఇప్పటివరకూ లీగ్ మ్యాచ్ లు ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ సెమీ ఫైనల్స్ కోసం చూస్తున్నారు

Update: 2023-11-14 02:40 GMT

ఇండియాలో వరల్డ్ కప్ ఫీవర్ కొనసాగుతుంది. ఇప్పటి వరకూ లీగ్ మ్యాచ్ లు ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ ఇక సెమీ ఫైనల్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఫైనల్స్ పై కూడా చర్చ జరుగుతుంది. సెమీ ఫైనల్స్ కు భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు చేరుకున్నాయి. రేపు ముంబయి వాంఖడే స్టేడియంలో భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరిదన్న దానిపై ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. బెట్టింగ్‌లు కూడా ప్రారంభం కానున్నాయి.

ఫైనల్స్ వీరి మధ్యేనట...
సెమీస్‌లో ఎవరూ గెలుస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. బలమైన జట్లు సెమీస్ కు చేరుకోవడంతో గెలుపోటములను ముందుగా అంచనా వేయడం కష్టమే అయినా ఎవరి ప్రిడెక్షన్స్ వారివి. అయితే ఆటతో పాటు లక్ కూడా కలసి రావాల్సి ఉంటుంది. చాలా మంది ఇప్పటికే ఫైనల్స్ ఏ జట్లు చేరతాయన్నదీ కూడా చెబుతూ మరింత హీటెక్కిస్తున్నారు. మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఫైనల్స్ కు చేరే జట్లు భారత్, ఆస్ట్రేలియా మాత్రమేనని చెప్పారు. న్యూజిలాండ్, సౌతాఫ్రికా కన్నా ఆస్ట్రేలియా ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో బలంగా ఉందని చెప్పాడు. అలాగే భారత్ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదని, తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్ లు గెలిచి సగర్వంగా సైమీ ఫైనల్ కు అడుగుపెట్టింది.
భారీ స్కోరుకు...
అయితే వాంఖడే స్టేడియంలో అత్యధిక పరుగులు చేసే అవకాశముంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన అన్ని మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకుని ఈ లెక్కలు వేస్తున్నారు. సౌతాఫ్రికా - ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా 399 పరుగులు చేసింది. అలాగే సౌతాఫ్రికా మరో మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 382 పరుగులు చేసింది. ఇదే స్టేడియంలో భారత్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ 357 స్కోరు చేసింది. ఆస్ట్రేలియా ఆప్ఘనిస్థాన్ పై 291 పరుగులు చేయడంతో మరోసారి సెమీ ఫైనల్స్ లో మూడు వందలు దాటే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇరుజట్ల బౌలర్లపైనే స్కోరు ఎంతన్నది ఆధారపడి ఉంటుంది.
టాస్ గెలిచినోళ్లు...
వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన వాళ్లు ఖచ్చితంగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలన్నాయి. అందుకే కులదీప్ యాదవ్ అన్నట్లు న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ కు దిగితే వికెట్లు వెంటవెంటనే పడగొట్టాలన్నారు. తక్కువ స్కోరుకే అవుట్ చేయడం అవసరం. అప్పుడు భారత్ బౌలర్లపైనే భారం పడనుంది. అదే టాస్ భారత్ గెలిస్తే ఎటూ బ్యాటింగ్ ఎంచుకుంటుంది కాబట్టి ఎక్కువ స్కోరు చేసి న్యూజిలాండ్ ను కట్టడి చేసేందుకు అవకాశం లభిస్తుందని అంటున్నారు. మొత్తం మీద ఫైనల్స్, సెమీ ఫైనల్స్ ప్రారంభం కాకముందే అంచనాలతో హీటెక్కిస్తున్నారు. బీపీలను పెంచుతున్నారు. వరల్డ్ కప్ ఇప్పుడు గెలవకుంటే మరెప్పుడు అన్నది ఫ్యాన్స్ అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News