World Cup Semifinals Race 2023 : గెలవడం ముఖ్యం కాదు.. మూడు జట్లకు ముఖ్యం అదేనట

వరల్డ్ కప్ మ్యాచ్‌లు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక సెమీ పైనల్స్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి

Update: 2023-11-08 12:40 GMT

వరల్డ్ కప్ మ్యాచ్‌లు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక సెమీ పైనల్స్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే సెమీఫైనల్స్ కు భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేరుకున్నాయి. నాలుగో స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ లు రేసులో ఉన్నాయి. మూడు దేశాలు ఎనిమిది మ్యాచ్ లు ఆడాయి. ఇక ఒక్కొక్క మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ లలో గెలుపుతో పాటు రన్ రేట్ కూడా ముఖ్యంగా కనపడుతుండటమే మూడు జట్లనూ ఆందోళనలోకి నెట్టింది. గెలుపు ముఖ్యం కాదు.. రన్ రేటు ఎంత సంపాదిస్తే సెమీ ఫైనల్ లో నాలుగో స్థానానికి చేరుకునే వీలుంటుంది.

శ్రీలంకతో ఆడాల్సి ఉండగా...
ముందుగా న్యూజిలాండ్ పరిస్థిిని చూద్దాం. వరల్డ్ కప్ ప్రారంభంలో న్యూజిలాండ్ గేమ్ మామూలుగా లేదు. అసలు న్యూజిలాండ్‌తో ఆడాలంటే భయపడే పరిస్థితిని కల్పించారు. కొన్ని మ్యాచ్ లు గెలిచిన తర్వాత ఓటములు ప్రారంభమయ్యాయి. సెమీ ఫైనల్స్ కు ఎప్పుడో దూసుకెళ్లాల్సిన న్యూజిలాండ్ జట్టు ఇప్పుడు రన్ రేట్ పై ఆధారపడుతూ బితుకుబితుకుమంటూ నెట్టుకు రావాల్సి వస్తుంది. అయితే రేపు న్యూజిలాండ్ శ్రీలంకతో ఆడాల్సి ఉంది. శ్రీలంక ఇప్పటికే సెమీ ఫైనల్స్ నుంచి తప్పుకుంది. అయితే రేపు జరగబోయే మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి మూడు వందలకు పైగా పరుగులు చేయాల్సి ఉంది. లేకుంటే శ్రీలంకపై ఎక్కువ తేడాతో గెలవాల్సి ఉంది. లేకపోతే ఫేట్ మారిపోతుంది.
ఐదో స్థానంలో ఉన్న...
ఇక పాకిస్థాన్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. పాకిస్థాన్ ఈ వరల్డ్ కప్ లో పేలవ ప్రదర్శనను చూపింది. ఫలితంగా కీలక మ్యాచ్‌లలో చేతులెత్తేసింది. ఆఖరికి ఆప్ఘనిస్థాన్ చేతిలోనూ ఓటమి పాలయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ కంటే రన్ రేట్ లో తక్కువగా ఉంది. అయితే ఆఖరి మ్యాచ్ మాత్రం ఇగ్లండ్ తో పాకిస్థాన్ ఆడాల్సి ఉంది. ఇది కొంత రిలీఫ్ కలిగించేదే. ఎందుకంటే ఇంగ్లండ్ జట్టు పెద్దగా ఫామ్ లో లేకపోవడం పాకిస్థాన్ కు కలసిరావచ్చు. అయితే ఇంగ్లండ్ పై గెలిస్తేనే సరిపోదు. భారీ గెలుపును పాకిస్థాన్ సాధించాల్సి ఉంటుంది. లేకపోతే జరగనున్న మ్యాచ్ లలో ఆప్ఘనిస్థాన్, న్యూజిలాండ్ ఓడిపోవాలని కోరుకుంటుంది.
ఈ ఇద్దరూ ఓడితేనే...
అలా చివరి మ్యాచ్ లలో ఆప్ఘనిస్థాన్, న్యూజిలాండ్ ఓడిపోతే పాకిస్థాన్ పంట పండినట్లే. లేకపోతే మళ్లీ రన్ రేటును లెక్కవేయాల్సి వస్తుంది. ఇలా వేస్తే పాక్ కు అనుకూలంగా ఫలితం మారక పోవచ్చు. ఆప్ఘనిస్థాన్ కూడా చివరి మ్యాచ్ సౌతాఫ్రికాతో ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ అది గెలిచినా ఇబ్బందే. న్యూజిలాండ్ శ్రీలంకపై గెలిచినా సెమీస్ కు చేరుకోవడం కష్టమవుతుంది. ఇంగ్లండ్ ఏమాత్రం పుంజుకుని పాకిస్థాన్ ను ఓడిస్తే ఇక ఇంటికి వెళ్లాల్సిందే. అందుకే ఈ చివరి మ్యాచ్ లు మూడు టీంలకు ముఖ్యమే. సెమీ ఫైనల్స్ కు చేరుకోవడానికి కేవలం గెలుపు మాత్రమే ముఖ్యం కాదు... రన్ రేట్ కూడా అంతే అవసరం. మూడు టీంలు సమానమైన పాయింట్లలో ఉండటం, రన్ రేట్ లో తేడా ఉండటంతో ఇప్పడు ఈ మూడు మ్యాచ్ లు టెన్షన్ ను రేపుతున్నాయి. ఈ మూడింటిలో గెలిచి నాలుగో స్థానం చేరుకున్న జట్టుతో భారత్ సెమీ ఫైనల్స్ ఆడాల్సి ఉంటుంది.


Tags:    

Similar News