Jammu Kashmir Elections : జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమిదే ఆధిక్యత
జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తుంది
జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తుంది. మొత్తం 90 స్థానాలకు గాను 51 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఒకరకంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు బీజేపీకి షాక్ ఇచ్చినట్లే కనపడుతుంది. ఇక్కడ బీజేపీ కేవలం 29 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతతో ఉంది. పీడీపీ కూడా రెండు స్థానాల్లోనే మెజారిటీలో ఉంది.
370 ఆర్టికల్ రద్దు తర్వాత...
370 ఆర్టికల్ రద్దు తర్వాత ప్రతిష్టాత్మకంగా బీజేపీ నేతలు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను తీసుకున్నారు. దీంతో పాటు గులాం నబీ ఆజాద్ పార్టీ ఏ రకమైన ప్రభావం చూపలేదు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎనిమిది మంది వరకూ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. దీంతో జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి ఏర్పడటం ఖాయంగా ఉంది.