జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం ఎప్పుడంటే?
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కలసి కూటమిగా కలసి పోటీ చేసిన సంగతి తెలసిందే. అయితే శాసనసభ పక్ష నేతగా ఒమర్ అబ్దుల్లాను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. కూటమి గెలిచిన అనంతరం ఆయన మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ కు తమ ప్రభుత్వం ఏర్పాటయిన వెంటనే రాష్ట్ర హోదా ప్రతిపాదనను అసెంబ్లీ ద్వారా పంపుతామని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
పాలన సజావుగా సాగేలా?
జమ్మూ కాశ్మీర్ లో పాలన సజావుగా సాగేలా కేంద్ర ప్రభుత్వం సమకరించాలని కోరారు. రాష‌్ట్ర హోదా ఇవ్వాలని ప్రధానికి తీర్మానాన్ని కూడా సమర్పిస్తామని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. త్వరలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ నేతలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళతామని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.