Jammu and Kashmir : జమ్మూకాశ్మీర్‌లో పోలింగ్ ప్రారంభం
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో విడత పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమయింది.
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో విడత పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమయింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పటిష్టమైన బందోబస్తును నిర్వహిస్తున్నారు. రెండో విడత పోలింగ్ లో శ్రీనగర్, బడ్‌గ్రామ్, రాజౌరీ, పూంచ్, గండేర్‌బల్, రియాసీ జిల్లాల్లో రెండో విడత పోలింగ్ జరుగుతుంది.
రెండో విడతలో...
రెండో విడత పోలింగ్ లో మొత్తం 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో సుమారు 25 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 239 మంది అభ్యర్థులున్నారు. మొదటి విడత లో అరవై శాతం వరకూ పోలింగ్ నమోదయింది. అక్టోబరు 1వ తేదీన మిగిలిపోయిన నలభై స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబరు 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.