Jammu and Kashmir : నేడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు
జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు నేటితో ముగియనున్నాయి. మూడు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం అన్ని స్థానాలకు నేటితో పోలింగ్ పూర్తికానుంది;

jammu and kashmir elections 2024
జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు నేటితో ముగియనున్నాయి. మూడు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం అన్ని స్థానాలకు నేటితో పోలింగ్ పూర్తికానుంది. ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభమయింది. మూడో విడత ఎన్నికల బరిలో మొత్తం 415 మంది అభ్యర్థులు ఉన్నారు. సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఇందుకోసం మొత్తం 5,060 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశఆరు.
మూడో విడత పోలింగ్...
మూడో విడత పోలింగ్ కోసం కేవలం మహిళల కోసం మొత్తం 240 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 39.18 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జమ్మూ ప్రాంతంలో 24, కాశ్మీర్ ప్రాంతంలో 16 నియోజకవర్గాలకు మొత్తం నలభై స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ఉన్న మొత్తం 90 స్థానాలకు మూడు విడతలుగా పోలింగ్ ను నిర్వహించారు. అక్టోబరు 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.