కృష్ణా డెల్టా వాసులకు గుడ్ న్యూస్

మహారాష్ట్ర, కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆల్మట్టి జలాశయానికి నీరు వచ్చి చేరుతుంది

Update: 2024-07-17 12:51 GMT

మహారాష్ట్ర, కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆల్మట్టి జలాశయానికి నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 14 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. దీంతో త్వరలోనే శ్రీశైలం, నాగార్జున సాగర్ కు నీరు చేరే అవకాశాలున్నాయి. కృష్ణా డెల్టా రైతులకు ఇది ఒక రకంగా శుభవార్త అని చెప్పాలి.

వారం రోజులు...
అక్కడి నుంచి నారాయణపూర్ నుంచి జూరాల వరకూ చేరుతుంది. తర్వాత శ్రీశైలంలో నీరు చేరి ఆ తర్వాత నాగార్జున సాగర్ కు చేరుతుంది. కన్నడ రాష్ట్రంలో పడుతున్న భారీ వర్షాలకు ఆల్మట్టి గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు వాంర రోజుల్లోనే వచ్చి చేరుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ కు నీరు చేరితే కృష్టాడెల్టాకు సాగునీరు చేరే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News