మిరపకాయ్ అదిరింది

వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో క్వింటా దేశీయ మిర్చి ధర ఎనభై వేలు పలికింది.

Update: 2023-01-07 06:13 GMT

రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తుంటాయి. అయితే ఒక్కోసారి ప్రభుత్వానికి సంబంధం లేకుండా వాటి ధరలు అందనంత పెరుగుతుంటాయి. టమటాలను చూస్తే అర్థం కాలే. ఒకసారి కిలో వంద రూపాయలు పలుకుతుంది. అదే టమాలా కిలో పది పైసలకు పడిపోతుంది. డిమాండ్ ను బట్టి, దిగుబడిని బట్టి పంటకు గిట్టుబాటు ధరలు లభిస్తాయన్నది మార్కెట్ నిపుణులు చెబుతున్న మాట.

మిర్చి ధర రూ.80 వేలు....
తాజాగా మిర్చికి ధర మామూలుగా పలకలేదు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో క్వింటా దేశీయ మిర్చి ధర ఎనభై వేలు పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలకింది. మార్కెట్ లో మంచి ధర లేకపోవడానికి దిగుబడి సరిగా లేకపోవడమేనంటున్నారు. పైగా తామర ఇతర తెగుళ్లను రైతులను కలవర పెడుతున్నాయి. దీంతో పంట దిగుబడిపైనే రైతులు ఆందోళన చెందుతున్నారు తప్పించి.. గిట్టుబాటు ధర మాత్రం ఎక్కువగా పలికింది.


Tags:    

Similar News