Telangana : విత్తనాల కోసం రైతన్నల పడిగాపులు
విత్తనాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో నించుని అగచాట్లు పడుతున్నారు
విత్తనాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. దుక్కి దున్ని రెడీ గా ఉంచిన భూముల్లో విత్తనాలు నాటేందుకు రైతులు విత్తనాల కోసం వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారు. ఉదయాన్నే వచ్చి చెప్పులు, టవళ్లు వరసలో ఉంచి తాము టిఫిన్లు చేసేందుకు బయటకు వెళ్లారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో విత్తనాల కోసం ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా జీలుగు, జనుము, పత్తి విత్తనాల కోసం రైతులు క్యూ కడుతున్నారు. విత్తనాలు దొరకడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల పహారాతో...
సరిపడా విత్తనాలను పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపిస్తున్నారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రైతులు విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నారు. అయినా వారికి కావాల్సిన మొత్తంలో విత్తనాలు కూడా అందకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు చేరుకుని ఆందోళనక దిగడంతో అధికారులు మొదట వచ్చిన వారికి టోకెన్లు ఇస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.