రైతులకు గుడ్ న్యూస్.. ఆ పంటలకు ధరలు ఇక ఇవే

రైతులకు గుడ్ న్యూస్ అందింది. కేంద్ర ప్రభుత్వం తన రెండో కేబినెట్ లో రైతులకు ఉపయోగకరమైన నిర్ణయాలను తీసుకుంది

Update: 2024-06-20 01:30 GMT

రైతులకు గుడ్ న్యూస్ అందింది. కేంద్ర ప్రభుత్వం తన రెండో కేబినెట్ లో రైతులకు ఉపయోగకరమైన నిర్ణయాలను తీసుకుంది. మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం తొలి సంతకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదలపైనే సంతకం చేశారు. ఇరవై వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలోనూ రైతులకు ఉపయోగకరమైన నిర్ణయాలను తీసుకున్నారు.

14 రకాల పంటలకు...
వరి, రాగి, మొక్కజొన్న, పత్తితో సహా పథ్నాలుగు పంటలకు కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తసీుకున్నారు. దీంతో క్వింటా వరి ధర 2,300 రూపాయలకు చేరింది. పంటల ఉత్పత్తి కన్నా 1.5 రెట్లు కనీస మద్దతు ధరను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. నూనెగింజలు, పప్పు ధాన్యాలకు కూడా మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News