ఏబీకి పోస్టింగ్ పై కొనసాగుతున్న సస్పెన్స్.. బలమైన కారణమిదేనట

ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈ నెలాఖరకు పదవీ విరమణ చేస్తున్నారు.

Update: 2024-05-19 07:42 GMT

ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈ నెలాఖరకు పదవీ విరమణ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఆయనకు మాత్రం ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయనను గత ప్రభుత్వం రెండు సార్లు సస్పెండ్ చేసింది. దీనిపై ఆయన క్యాట్ ను ఆశ్రయించారు. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ మాత్రం ఆయనకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వాలని, సస్పెన్షన్ కాలంలో జీతం కూడా చెల్లించాలని తీర్పు చెప్పింది. మరో వైపు ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ అనుమతిచ్చింది. ఆయన ఈ నెలాఖరకు పదవీ విరమణ చేయనున్నారు.

కేంద్ర హోం శాఖ నుంచి...
అందువల్లనే ఆయనకు పోస్టింగ్ ఇవ్వడంలో ఆలస్యమవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ప్రభుత్వం సమర్పించిన వివరాలను పరిశీలించిన తర్వాత ఆయన ప్రాసిక్యూషన్ కు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఆయన ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం అధిపతిగా ఉన్న సమయంలో నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనికి కేంద్ర హోంశాఖ అనుమతించింది. దీంతో పాటు కౌంటింగ్ సమయంలో అధికారులను ఏబీ వెంకటేశ్వరరావు బెదిరించే అవకాశాలున్నాయని కూడా వైసీపీ చేసిన ఫిర్యాదుతోనే ఆయన పోస్టింగ్ విషయంలో ఆలస్యమవుతుందని చెబుతున్నారు. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు తరుపున కొందరు సంతకాల ఉద్యమాన్ని చేపట్టడం విశేషం. మరి ఏబీ వెంకటేశ్వరరావుకు ఈ పన్నెండు రోజుల్లో పోస్టింగ్ ఇస్తారా? లేదా? అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.


Tags:    

Similar News