తిరుమలలో ఫుల్లు.. నో పార్కింగ్

తిరుమలలోని నాలుగు మాడ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు ితిరుమలకు చేరుకున్నారు.

Update: 2022-10-01 11:45 GMT

తిరుమలలో భక్తులు పోటెత్తారు. నాలుగు మాడ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు ితిరుమలకు చేరుకున్నారు. ఉదయం నుంచే మాడ వీధుల్లో భక్తులు స్వామి వారి కోసం ఎదురు చూస్తున్నారు. రాత్రికి గరుడ వాహనంపై స్వామి వారు దర్శనం ఇవ్వనుండటంతో భక్తులు లక్షలాది మంది తరలి వచ్చారు. వచ్చిన భక్తులందరికి తీరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్న ప్రసాదం, మంచినీటిని అందజేస్తున్నారు.

అలిపిరి వద్దనే....
ఇక వాహనాలు కూడా తిరుమల కొండ మీద పూర్తిగా ఫుల్లు అయ్యాయి. పార్కింగ్ చేేసేందుకు ఎక్కడా వీలు లేదు. దీంతో అధికారులు అలిపిరి వద్దనే వాహనాలను నిలిపివేస్తున్నారు. కొండ మీదకు ఎలాంటి వాహనాలను అనుమతించం లేదు. రాత్రి ఏడు గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమవుతుంది. రాత్రి తొమ్మిది గంటల వరకూ వాహన సేవ కొనసాగగుతుంది.


Tags:    

Similar News