Andhra Pradesh : నేడు ఆరో రోజుకు చేరుకున్న అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు కీలక బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపట్టనుంది
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు కీలక బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపట్టనుంది. తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టిన తర్వాత అనంతరం హిందూపూర్ అర్బన్ డెవలెప్ మెంట్ అధారిటీ వార్షిక ఆడిట్ రిపోర్టును, గత ప్రభుత్వ హయాలో ఆడిట్ రిపోర్టులు ఆలస్యం అవ్వడానికి గల కారణాలను మంత్రి పొంగూరి నారాయణ వివరించనున్నారు.
కీలక బిల్లులను..
డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీలో ప్రతినిధులుగా ఎమ్మెల్యేలలో ఒకరిని ఎన్నుకోవడానికి అవసరమైన బిల్లును సభ ముందు ఉంచనున్నారు. ఈ బిల్లును బీసీ జనార్థన్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సయితం పంచాయతీరాజ్ డిమాండ్ కింద11,846 గ్రాంట్లను సభ ముందు ప్రవేశపెట్టనున్నారు. మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్య కింద 29,909 కోట్ల గ్రాంట్ ను, ఉన్నత విద్య కింద 2326 కోట్ల గ్రాంట్ ను ప్రవేశపెట్టనున్నారు. పంచాయతీరాజ్ బిల్లును పవన్ కల్యాణ్ ప్రవేశపెట్టనున్నారు.