Andhra Pradesh : నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం.. కీలకనిర్ణయాలివే

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. కీలక అంశాలపై చర్చించి ఆమోదించనున్నారు

Update: 2024-12-19 01:29 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించనున్నారు. సీఆర్డీఏ సమావేశంలో ఇటీవల తీసుకున్న 24,276 కోట్ల రూపాయల పనులకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది.

చర్చించే విషయాలివీ...
అలాగే రేషన్ బియ్యం విదేశాలకు తరలి పోకుండా తీసుకోవాల్సిన చర్యలు, తీసుకు రావాల్సిన చట్టాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన అంశంపై చర్చిస్తారు. అలాగే రాష్ట్రంలో సోషల్ మీడియాలో నమోదయిన కేసులు, వాటి పురోగతిపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. నెలకు రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలన్న చంద్రబాబు నిర్ణయం ఈ నెల నుంచి అమలు జరుగుతుంది. ఈ నెలలో మంత్రి వర్గం సమావేశం కావడం ఇది రెండో సారి.


Tags:    

Similar News