Andhra Pradesh : పరిటాల రవి హత్యకేసులో నిందితులకు ఐదుగురికి బెయిల్

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన పరిటాల రవి హత్యకేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది

Update: 2024-12-18 12:52 GMT

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన పరిటాల రవి హత్యకేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఐదుగురు ప్రధాన నిందితులకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకాలు చేయాలని, అలాగే ఒక్కొక్కొరు 25 వేల రూపాయల పూచికత్తును సమర్పించాలని కోరింది.


షరతులతో కూడిన...

పరిటాల రవి కేసులో కీలక నిందితులుగా ఉన్న పండుగనారాయణరెడ్డి, రేఖమయ్య, బజన రంగనాయకులు, వడ్డే కొండ, ఓబిరెడ్డిలకు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరు ముందస్తు విడుదల చేయడానికి దరఖాస్తు చేసుకోవడానికి వీరు అర్హులని కూడా చెప్పింది. దీంతో ఈ కేసులో నిందితులకు కొన్నేళ్ల తర్వాత బెయిల్ లభించినట్లయింది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now



Tags:    

Similar News