ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది.

Update: 2024-12-19 01:57 GMT

కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీపికబురు అందించింది. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. సాగరమాల 2 ప్రాజెక్టు కింద కొత్తపట్నం మండలంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీని నిర్మాణం కోసం అవసరమైన 40 ఎకరాల భూమిని గుర్తించాలని కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ ఆదేశాలు జారీచేశారు.

ఉపాధి అవకాశాలు...
దీంతో ప్రకాశం జిల్లా వాసుల కల త్వరలో సాకారం కానుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో మత్స్యకారులకు మాత్రమే కాకుండా యువతకు కూడా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి అతి సమీపంలో ఉండే కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయితే మరింత ప్రయోజనాలు అందుతాయని భావిస్తున్నారు.


Tags:    

Similar News