Chandrababu : బాధలో ఉన్నవారికి తీపికబురు చెప్పిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు బాధలో ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పారు

Update: 2024-12-28 03:41 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు బాధలో ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పారు. భర్త చనిపోయి విషాదంలో ఉన్న వారికి వెంటనే పింఛన్లు మాంజూరు చేయాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 31వ తేదీన పంపిణీ అయ్యే పింఛన్లలో 5,402 మంది వరకూ పింఛనును పొందనున్నారు. భర్త చనిపోయిన వెంటనే అదే నెలలో భార్యకు పింఛను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు అటువంటి వారిని గుర్తించి ఈ నెల పింనును అందించేందుకు సిద్ధమయ్యారు.

ఈ నెల నుంచి...

భర్త చనిపోయిన వెంటనే అదే నెలలో పింఛను భార్యకు అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు ఎంపిక చేసిన లబ్దిదారుల సంఖ్య 5,402 మంది రాష్ట్రంలో ఉన్నట్లు కనుగొన్నారు. వీరందరికీ డిసెంబరు 31వ తేదీన నాలుగు వేల రూపాయల పింఛనును మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో భర్త కోల్పోయి బాధపడుతున్న వితంతువులకు ఊరట లభించినట్లయింది. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో అనేక మంది ప్రయోజనం పొందనున్నారు. అలాగే మూడు నెలలకు ఒకసారి పింఛను ను పొందేలా కూడా నిబంధనలను సవరించడం కూడా మంచిదనే చెబుతున్నారు.





Tags:    

Similar News