Perni Nani : నేను ఎక్కడికి పారిపోతాను .. చంద్రబాబును ప్రశంసించిన పేర్ని నాని
తాను కేసులకు భయపడి ఎక్కడకూ పారిపోలేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
తాను కేసులకు భయపడి ఎక్కడకూ పారిపోలేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొద్ది రోజులుగా తనపై సోషల్ మీడియాలోనూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తాను న్యాయ పోరాటం చేస్తున్నానని తెలిపారు. శాఖపరమైన విచారణ కంటే సోషల్ మీడియా విచారణ ఎక్కువగా కనిపిస్తుందని పేర్ని నాని తెలిపారు. తన భార్య గోదాములో సివిల్ సప్లయ్ అధికారులు ధాన్యం ఉంచిన మాట వాస్తవమేనని, అయితే అందులోమిస్ అయిన వాటికి డబ్బులు చెల్లించామని తెలిపారు.
నైతికంగా మాత్రం...
తాము నైతికంగా బాధ్యత వహిస్తూనే ఈ డబ్బులు చెల్లించామని పేర్నినాని తెలిపారు. న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ కు కూడా దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. టిక్నికల్ గా తమ తప్పు లేదని పేర్నినాని లేదనిచెప్పారు. అయితే తమ గోదాములో బియ్యం మిస్ అయినందున తాము నైతికంగా బాధ్యత ను తీసుకుంటామని చెప్పారు. తనపై రాజకీయ కక్షతో మహిళలను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. తాము ఆ బియ్యం దొంగిలించినట్లు ఆధారాలున్నాయా? అని పేర్ని నాని ప్రశ్నించారు. న్యాయపరంగానే ఈ కేసులో పోరాడతామని పేర్నినాని చెప్పారు. తాము అద్దె కోసమే గోదాములో రేషన్ బియ్యాన్ని ఉంచామన్నారు.చంద్రబాబు మాత్రం తన భార్యను ఒప్పుకోలేదని పేర్నినాని అన్నారు.మంత్రి ఎన్నిసార్లు చెప్పినా చంద్రబాబు అంగీకరించలేదన్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now