మళ్లీ అప్పుకు ఏపీ రెడీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అప్పుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకుంది

Update: 2024-12-28 05:16 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అప్పుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకుంది. ఐదు వేల కోట్ల రూపాయల రుణాన్ని పొందేందుకు ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల రెండో తేదీన ఐదు వేల కోట్ల రూపాయల అప్పులను తీసుకుంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ రుణాన్ని తీసుకోనుంది. ఇప్పటి వరకూ చంద్రబాబు ప్రభుత్వం 75 వేల కోట్ల రూపాయల రుణం చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


ఐదు వేల కోట్లు...

అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయకుండా కేవలం అభివృద్ధి అంటూ చెప్పడమేంటని నిలదీస్తున్నారు. గతంలో తాము చేసిన అప్పులను సంక్షేమ పథకాలకు వినియోగించామని, అయితే ఇప్పుడు చంద్రబాబు చేసిన అప్పులతో జనాలకు ఏం ఒరుగుతుందని, ప్రజలపై ఒకవైపు భారం మోపుతూనే మరొక వైపు అప్పులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.




Tags:    

Similar News