Andhra Pradesh : నేడు ఏపీ సీఎం చంద్రబాబుతో టాలీవుడ్ పెద్దల భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నేడు టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు సమావేశం కానున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నేడు టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు సమావేశం అయ్యే అవకాశముంది. సంక్రాంతి పండగ వస్తుండటం, టిక్కట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. సినిమాలు వరసగా విడుదల కానుండటంతో వీరు దీనిపైనే చర్చించే అవకాశముంది. అదే సమయంలో చంద్రబాబు కూడా ఏపీకి సినీ పరిశ్రమ తరలి రావడంపై వచ్చే అవకాశాలను పరిశీలించాలని కోరనున్నారు.
రాయితీలు ఇస్తామని...
షూటింగ్ లు ఎక్కువగా చేయడంతో పాటు, సినీ పరిశ్రమకు సంబంధించిన 24 క్రాప్ట్స్ కు సంబంధించిన వివిధ విభాగాలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం రాయితీలను కూడా ప్రకటిస్తుందన్న హామీ ఇవ్వనున్నారని తెలిసింది. ఇప్పటికే నంది అవార్డుల విషయమై చంద్రబాబు సినీనటుడు మురళీమోహన్ తో ఇప్పటికే మాట్లాడారని చెబుతున్నారు. నంది అవార్డుల ఎంపిక పై కూడా చర్చించే అవకాశముందని తెలిసింది. ఇటీవల తెలంగాణ సీఎంతో భేటీ అయిన తర్వాత నేడు ఏపీ ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.