Chandrababu : నేడు విశాఖలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి విశాఖకు చేరుకున్న చంద్రబాబు ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముంబయిలోని దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి బయలుదేరి విశాఖకు చంద్రబాబు నిన్న రాత్రి చేరుకున్నారు. రాత్రి విశాఖలోనే విశ్రాంతి తీసుకున్నారు.
వరసకార్యక్రమాలతో...
ఎన్టీఆర్ భవన్ లోనే బస చేసిన చంద్రబాబు ఈరోజు డీప్ టెక్నాలజీ సమ్మి 2024కు హాజరవుతారు. అక్కడ ప్రసంగించిన తర్వాత విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలెప్ మెంట్ అథారిటీ ప్రాజెక్టుపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు. చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లను పార్టీ కార్యకర్తలు చేశారు. అలాగే భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.