Chandrababu : రేపు రాజధాని అమరావతిపై శ్వేతపత్రం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గత ఐదేళ్లలో అమరావతిలో ఒక్కపని కూడా చేపట్టకకుండా వైసీపీ ప్రభుత్వం రాజధానిని విధ్వంసం చేసిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొననున్నారు. అమరావతిని ఐదేళ్లలో అభివృద్ధి చేయక పోవడంతో ఎంత ఆదాయాన్ని కోల్పోయింది వివరించనున్నారు.
నేడు ఆర్ అండ్ బి పై సమీక్ష...
ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా చేసి దేశంలోనే రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారని శ్వేతపత్రం విడుదల సమయంలో చెప్పనున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఉదయం పదిగంటలకు సచివాలయానికి రానున్నారు. ఆయన నేడు రహదారులు, భవనాల శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులపై ఆయన సమీక్ష నిర్వహించి, వర్షాకాలం కావడంతో రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించనున్నారు. రోడ్ల విస్తరణపై కూడా చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.