Chandrababu : చంద్రబాబు నేడు కృష్ణా జిల్లాలో పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలోనిగంగూరు, ఈడ్పుగల్లులో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరణను చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతరం రైతులతో మాట్లాడనున్నారు.
రెవెన్యూ సదస్సులో...
తర్వాత ఈడ్పుగల్లులో రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. చంద్రబాబు కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనసమీకరణకు పార్టీ నేతలు సిద్ధమయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.