నేడు కుప్పంలో నారా భువనేశ్వరి రెండో రోజు?
నేడు కుప్పంలో రెండోరోజు నారా భువనేశ్వరి పర్యటన సాగుతుంది.
నేడు కుప్పంలో రెండోరోజు నారా భువనేశ్వరి పర్యటన సాగుతుంది. రెండు రోజులుగా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తన భర్త చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆమె పర్యటిస్తూ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు.
మహిళలతో ముఖాముఖి...
ఈరోజు కూడా నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేతలతో సమావేశంకానున్న భువనేశ్వరి రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి నారాభువనేశ్వరి వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు.