Pawank Kalyan : నేడు ఉత్తరాంధ్ర పర్యటనకు పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లనున్నారు. నేడు పార్వతీపురం మన్యం జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. జిల్లాలోని సాలూరులో ఆయన పర్యటన సాగనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉదయం 9.30 గంటలు విశాఖ పట్నం ఎయిర్ పోర్టు కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పవన్ కల్యాణ్ సాలూరుకు వెళతారు. అక్కడ సాలూరు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బస వద్దకు చేరుకుని నేతలతో కాసేపు మాట్లాడతారు.
గిరిజనులతో ముఖాముఖి...
తర్వాత మధ్యాహ్నం నుంిచ మక్కువ మండలం బాగుజోల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. అంతకు ముందు అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను కూడా తిలకిస్తారు. ఈరోజు సాయంత్రానికి విశాఖకు పవన్ కల్యాణ్ చేరుకుంటారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించి వాటి నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. 21వ తేదీ కూడా పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలోనే ఉండే అవకాశముంది. అయితే వర్షాల నేపథ్యంలో పవన్ పర్యటన ఉంటుందా? లేదా? అన్నది తేలనుంది.