Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు

Update: 2024-12-02 03:50 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు వివిధ శాఖలపై తన నివాసంలోనే చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. పన్నెండు గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పునర్ వ్యవస్థీకఱణపై చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. ఈరోజు దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

సీఆర్డీఏ సమావేశంలో...
అనంతరం సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. రాజధాని అమరావతి లో చేపట్టాల్సిన నిర్మాణపనులపై అధికారులతో చర్చిస్తారు. సీఆర్డీఏ కార్యాలయం నిర్మాణంతో పాటు ఇతర భవనాల విషయంపైన కూడా అధికారులతో చర్చిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు.


Tags:    

Similar News