ఏపీలో రికార్డు స్థాయిలో టీడీపీ సభ్యత్వాలు.. ఎంతంటే?
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో సభ్యత్వాలను నమోదు చేసింది
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో సభ్యత్వాలను నమోదు చేసింది. ఈరోజు కు సభ్యత్వాలు అరవైలక్షలు దాటాయని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. రోజుకు సరాసరి లక్షన్నర సభ్యత్వాన్ని ప్రజలు, కార్యకర్తలు తీసుకుంటున్నారు. ఈ సభ్యత్వం మరింత పెరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీలయినంత ఎక్కువ మొత్తంలో సభ్యత్వాలు చేర్చాలని అధినాయకత్వం నియోజకవర్గ నేతలకు ఆదేశాలు జారీ చేసింది.
అధికారంలో ఉండటంతో...
అయితే ఈసారి పార్టీ అధికారంలో ఉండటంతో కొత్త సభ్యత్వాలు ఎక్కువగా నమోదయ్యాయని చెబుతున్నారు. దీంతోపాటు వాట్సాప్ ద్వారా సులువుగా సభ్యత్వం పొందే అవకాశం కల్పించడంతో ఎక్కువ మంది చేరుతున్నారని పార్టీ హైకమాండ్ చెబుతుంది. కేవలం వంద రూపాయల సభ్యత్వంతో ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించడం కూడా సభ్యత్వాలు పెరగడానికి కారణమని చెప్పాలి.