Tirumala : తిరుమలలో పూర్తిగా తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగానే దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ నేడు పూర్తిగా తగ్గింది. శ్రీవారి దర్శనం నేరుగా లభిస్తుంది.

Update: 2024-12-02 03:03 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు పూర్తిగా తగ్గింది. శ్రీవారి దర్శనం నేరుగా లభిస్తుంది. ఎక్కడా వేచి ఉండకుండానే దర్శనం లభిస్తుంది. సోమవారం కావడంతో పాటు ఫెంగల్ తుపాను బీభత్సంతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. గత మూడు రోజుల నుంచి భక్తులతో నిండిపోయిన తిరుమల నేడు మాత్రం బోసి పోయి కనిపిస్తుంది. ఖాళీ వీధులు దర్శనమిస్తున్నాయి. సోమవారం కావడంతోపాటు కార్తీక మాసం కూడా నేటితో ముగియడంతో నేడు భక్తుల రద్దీ తగ్గిందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు పెద్దగా లేకపోవడంతో దర్శనం మాత్రమే కాదు. వసతి గృహాలు కూడా సులువుగానే లభ్యమవుతున్నాయి. అధికారులు రద్దీ తక్కువగా ఉండటంతో లడ్డూ ప్రసాదాల తయారీని కూడా తగ్గించినట్లు తెలిసింది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అధిక సంఖ్యలో లడ్డూలను తయారు చేస్తారు. అయితే తయారు చేసిన లడ్డూలను తిరుమల నుంచి అనేక ప్రాంతాలకు పంపించడంతో అక్కడ కూడా విక్రయం చేపట్టడంతో లడ్డూల తయారీ సాధారణంగానే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా అందచేయడం సంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే.

వేచిఉండకుండానే....
తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం నుంచి గురువారం వరకూ కొంత తక్కువగానే ఉంటుంది. తిరిగి శుక్ర, శని, ఆదివారాల్లో రద్దీ పెరుగుతుంది. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు దర్శన సమయం కూడా తక్కువగా ఉండటంతో అత్యధిక మంది ఒకేరోజు రెండుసార్లు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. నేరుగా శ్రీవారిని దర్శించుకునే వీలు కలుగుతుంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం టోకెన్ లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 67,496 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,064 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.33 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News