Ys Jagan : జగన్ బెయిల్ రద్దు కేసులో సుప్రీం ఏమందంటే?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ ఈరోజు జరిగింది.

Update: 2024-12-02 07:16 GMT

group 1 mains exam 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ ఈరోజు జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ పురోగతి ఏ దశలో ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. సిబిఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో జగన్ అక్రమాస్తుల పై దాఖలైన కేసుల వివరాలను పట్టిక రూపంలో ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. రోజూ వారీ విచారణకు ఆదేశించినా ఎక్కడ ఆటంకం కలుగుతుందని ధర్మాసనం ప్రశ్నించింది.

తదుపరి విచారణను...
ఏఏ కోర్టులలో ఏఏ కేసులు దాఖలయ్యాయి...వాటి విచారణ ఏ దశలో ఉందో తెలుపుతూ సమగ్రంగా పట్టిక రూపంలో ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది.అఫిడవిట్ రూపంలో ఇచ్చిన పట్టిక చూసిన తరువాత ఏం చేయాలో చెబుతామన్న జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. రఘురామ కృష్ణరాజు జగన్ బెయిల్ రద్దు చేయడమే కాకుండా కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ గతంలో సుప్రీంలో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై తదుపరి విచారణను ఢిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేశారు.


Tags:    

Similar News