చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది. ఉదయం 11 గంటలకు ఉండవల్లి తన నివాసం నుంచి సచివాలయానికి చంద్రబాబు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ తో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. మధ్యాహ్నం రెండు గంటలకు వ్యవసాయ శాఖపై చంద్రబాబు సమీక్ష చేస్తారు.
అన్నదాత సుఖీభవ...
రైతు పెట్టుబడి సాయం కింద విధివిధానాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో అర్హులైన రైతులను ఎంపిక చేయాలని, అందుకోసం మార్గదర్శకాలను విడుదల చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ సమీక్ష అనంతరం సాయంత్రం 6 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.