రేపు, ఎల్లుండి ఏపీ సర్కార్ సెలవులు రద్దు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపు, ఎల్లుండి కూడా ఆస్తిపన్ను వసూలు కేంద్రాలు పనిచేస్తాయని తెలిపింది;

Update: 2025-03-29 05:37 GMT
government,  good news,  people.andhra pradesh
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపు, ఎల్లుండి కూడా ఆస్తిపన్ను వసూలు కేంద్రాలు పనిచేస్తాయని తెలిపింది. ఆస్తిపన్ను చెల్లించాల్సిన వారు ఇబ్బంది పడకుండా వారికి సెలవులను రద్దు చేస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల్లో ఈ నెల 30, 31వ తేదీల్లో ఆస్తిపన్ను కేంద్రాలు పనిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వడ్డీపై రాయితీ...
ఈ నెలాఖరుకు ఆస్తిపన్ను చెల్లింపు గడువు ముగియనుండటంతో ప్రభుత్వం రాయితీని కల్పించింది. ఈ నెల 31వ తేదీ లోపు చెల్లించిన వారికి ఆస్తిపన్నుల బకాయీల వడ్డీపై యాభై శాతం రాయితీని ప్రకటించింది. అయితే సెలవుల కారణంగా చెల్లించలేమని అనకుండా రేపు, ఎల్లుండి ఆస్తి పన్ను వసూలు కౌంటర్లు ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు పనిచేయనున్నాయి.


Tags:    

Similar News